AP 10th Class Results 2024…ఎలా చెక్ చేయాలంటే

ఏపిలో పదవతరగతి పరీక్షలు వ్రాసిన విధ్యార్ధులకు శుభవార్త! టెన్త్ ఫలితాల విడుదలకు రంగం సిద్దం అయింది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ (BSEAP) ఏప్రిల్ 25 నాటికి AP SSC ఫలితం 2024ని విడుదల చేస్తుందని భావిస్తున్నారు.

మార్చి 18 నుంచి 30 వరకు జరిగిన SSC పరీక్షలకు దాదాపు 7 లక్షలమంది హాజరయ్యారు. ప్రశ్నపత్రాలను దిద్దే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. చివరిగా ఒకసారి పరిశీలించి ఆన్లైన్ లోకి మార్కులను ఎక్కించే ప్రక్రియ దాదాపు చివరి దశకు వచ్చింది.

ఇక ఫలితాలు వచ్చే వారంలో విడుదల అవుతాయి.

ఆంధ్రప్రదేశ్ SSC 10వ తరగతి బోర్డు పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను BSEAP అధికారిక వెబ్‌సైట్‌లో bse.apgov.inలో చూసుకోవచ్చు. results.bse.ap.gov.inలో కూడా తనిఖీ చేయవచ్చు.

Sharing is caring!