TS 10th Class Results 2024: తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల.. ఎప్పుడంటే

తెలంగాణ టెన్త్ పరీక్షా ఫలితాలు ఈనెల 30 (మంగళవారం) న విడుదల కానున్నాయి. ఆరోజు ఉదయం 11 గంటలకు విద్యా శాఖ కమిషనర్‌ బుర్రా వెంకటేశం పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈమేరకు సెకండరీ బోర్డు ఒక అధికారిక సమాచారం ఇచ్చింది.

ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగగా మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్‌ 20 నాటికే పూర్తయింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.08 లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు ఉన్నారు. అలాగే 2,50,433 ల‌క్ష‌ల మంది బాలిక‌లు ఉన్నారు.

కాగా గతేడాది మొత్తం 4,84,370 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ఉత్తీర్ణత శాతం 86.60% ఉంది. దీనిలో బాలుర కంటే బాలికలు ఎక్కువగా 88.53%తో మెరిశారు. 84.68 మంది బాలురు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.

అందరికంటే ముందుగా ఫలితాలను తెలుసుకోడానికి ఈ లింకు పై క్లిక్ చేయండి

Sharing is caring!