BOI Jobs 2024 బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లో 143 ఆఫీసర్‌ ఉద్యోగాలు, జీతం లక్ష పైనే!

ముంబై ప్రధాన కేంద్రంగా గల పబ్లిక్ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 143 ఆఫీసర్‌ (ఎంఎంజీఎస్‌-II/ ఎస్‌ఎంజీఎస్‌-IV/ ఎంఎంజీఎస్‌-III) పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ కలిగి ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఏప్రిల్‌ 10 లోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టింగ్ దేశవ్యాప్తంగా గల బ్రాంచ్ లలో కలదు.

మొత్తం ఖాళీలు : 143

  • క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు : 25
  • చీఫ్ మేనేజర్ పోస్టులు : 09
  • లా ఆఫీసర్ పోస్టులు : 56
  • డేటా సైంటిస్ట్ పోస్టులు : 02
  • ఎంఎల్‌ ఓపీఎస్‌ ఫుల్‌ స్టాక్ డెవలపర్ పోస్టులు: 02
  • డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు : 02
  • డేటా క్వాలిటీ డెవలపర్ పోస్టులు : 02
  • డేటా గవర్నెన్స్ ఎక్స్‌పర్ట్ పోస్టులు : 02
  • ప్లాట్‌ఫాం ఇంజినీరింగ్ ఎక్స్‌పర్ట్‌ పోస్టులు : 02
  • లైనక్స్‌ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు : 02
  • ఒరాకిల్ ఎక్సాడాటా అడ్మినిస్ట్రేటర్ పోస్టులు : 02
  • సీనియర్ మేనేజర్ పోస్టులు : 35
  • ఎకనమిస్ట్‌ పోస్టులు : 01
  • టెక్నికల్ అనలిస్ట్ పోస్టులు : 01

విద్యార్హతలు: సంబంధిత విభాగంలో సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్, డిగ్రీ, పీజీ, పీజీడీఎం ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థికి 01- ఫిబ్రవరి -2024 నాటికి కనీసం 25 సంవత్సరాలు & గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి.

వేతన వివరాలు: నెలకు ఎంఎంజీఎస్‌-II పోస్టులకు రూ.48,170-69,810/ ఎస్‌ఎంజీఎస్‌-IV పోస్టులకు రూ.76,010- రూ.89,890/ ఎంఎంజీఎస్‌-III పోస్టులకు రూ.63,840- రూ.1,05,280 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175)గా నిర్ణయించారు.

దరఖాస్తు విధానం : అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 27, 2024
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 10, 2024

నోటిఫికేషన్ఇక్కడ క్లిక్ చేయండి
అప్లికేషన్ ఫామ్ఇక్కడ క్లిక్ చేయండి