UPSC ESE 2024: ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్ పరీక్షా తేదీలివే!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ (ESE 2024 మెయిన్ ఎగ్జామ్) షెడ్యూల్‌ను విడుదల చేసింది, ఇది ESE ప్రిలిమ్స్ 2024లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ మెయిన్స్ పరీక్ష రాయబోతున్నారు.

.ఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ ప్రకారం ESE 2024 ప్రధాన పరీక్ష జూన్ 23న నిర్వహించబడుతుంది, పరీక్ష రెండు షిఫ్ట్‌లలో జరుగుతుంది. మొదటి షిప్టు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, రెండవ షిప్టు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది అని ఆ అధికారిక ప్రకటన ద్వారా వివరించింది UPSC.

అహ్మదాబాద్, చండీగఢ్, డిస్పూర్ (గౌహతి), లక్నో, షిల్లాంగ్, ఐజ్వాల్, చెన్నై, హైదరాబాద్, ముంబై, సిమ్లా, అలహాబాద్, కటక్, జైపూర్, పాట్నా, తిరువనంతపురం, బెంగుళూరు, డెహ్రాడూన్, జమ్ము, రాయ్‌పూర్, విశాఖపట్నం, భోపాల్, ఢిల్లీ, కోల్‌కతా మరియు రాంచీ వంటి ప్రధాన నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.

Sharing is caring!