Telangana Inter Results 2024 Update : తెలంగాణ‌లో ఇంటర్‌ రిజ‌ల్డ్స్‌ ఎప్పుడంటే..?

ఏపిలో ఇంటర్ ఫలితాలు రిలీజ్ కావడంతో ఇప్పుడు తెలంగాణ‌లోని ఇంట‌ర్ విద్యార్థులు ఫ‌లితాలు విడుద‌ల‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసున్నారు.

ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఇంట‌ర్ సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మార్కుల జాబితా సక్రమంగా ఉందా? సాంకేతికపరమైన సమస్యలున్నాయా? అనే అంశాలను ఒకటికి రెండు సార్లు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే దీంతో పాటు వ్యాల్యూయేషన్‌లో వచ్చిన మార్కులను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

ఏప్రిల్‌ 21వ తేదీ నాటికే..
ఈ ప్ర‌క్రియ‌కు వారం రోజులు పాటు స‌మ‌యం పట్టే అవకాశం ఉందని చెపుతున్నారు. పరీక్ష రాసిన వారు, గైర్హాజరైన వారు, మాల్‌ ప్రాక్టీసింగ్‌కు పాల్పడిన విద్యార్థుల డేటాను కంప్యూటరీకరించాల్సి ఉంటుంది. 
ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్‌ 21వ తేదీ నాటికే ముగించాలని అధికారులు భావిస్తున్నారు. అని సానుకులంగా కుదిరితే.. తెలంగాణ ఇంటర్మీడియెట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఒకేసారి ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీలోపు ఏక్ష‌ణంలోనైన‌ విడుదల చేయ‌నున్నారు.

Sharing is caring!