NIPER Jobs: నైపర్‌లో 78 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

గువాహటిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్… ఓపెన్ కాంపిటీషన్ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

* టీచింగ్ పోస్టులు

1. ప్రొఫెసర్ (మెడికల్ కెమిస్ట్రీ): 14 పోస్టులు

2. ప్రొఫెసర్ (బయోటెక్నాలజీ): 14 పోస్టులు

3. అసిస్టెంట్ ప్రొఫెసర్ (బయోఫార్మాస్యూటికల్స్): 12 పోస్టులు

4. అసిస్టెంట్ ప్రొఫెసర్ (బయోటెక్నాలజీ): 12 పోస్టులు

5. అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫార్మసీ ప్రాక్టీస్): 12 పోస్టులు

* నాన్ టీచింగ్ పోస్టులు

1. సైంటిస్ట్/ టెక్నికల్ సూపర్‌వైజర్ గ్రేడ్-I: 09 పోస్టులు

2. అసిస్టెంట్ గ్రేడ్-II (అడ్మినిస్ట్రేషన్): 05 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 78.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: అసిస్టెంట్ గ్రేడ్-II పోస్టులకు 35 ఏళ్లు; ప్రొఫెసర్/ సైంటిస్ట్‌ పోస్టులకు 40 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు అసిస్టెంట్ గ్రేడ్-II పోస్టులకు రూ.29,000; సైంటిస్ట్ పోస్టులకు రూ.53,000; ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,44,200; అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.78,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: టీచింగ్ పోస్టులకు రూ.1000; నాన్ టీచింగ్ పోస్టులకు రూ.500.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-04-2024.

దరఖాస్తు హార్డ్ కాపీ పోస్టులో పంపేందుకు చివరి తేదీ: 27-04-2024.

వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!