APPSC Group 1 Results 2024: గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల… 4496 మంది క్యాలిఫైడ్

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మార్చి 27వ తేదీన నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలను ప్రకటించింది. రికార్డు స్థాయిలోనే 27 రోజుల్లో ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. గ్రూప్ వన్‌కి మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్ష రాసిన వాళ్ల నుంచి 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు.

ఇక గత సంవత్సరం డిసెంబర్‌ 08న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా 81 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఈ పరిక్ష నోటిఫికేషన్‌ ప్రకారం చూస్తే.. 2024 సెప్టెంబర్‌ 02, 09 తేదీల మధ్య మెయిన్స్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని మీడియా పూర్వకంగా ఏపీపీఎస్సీ తెలిపింది.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

Sharing is caring!