AP 10th Results 2024: టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడంటే…

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షల ఫలితాలు రికార్డ్ సమయంలో కేవలం 22 రోజుల్లోనే విడుదల కావడంతో, ఇప్పడు అందరి దృష్టి టెన్త్ ఫలితాలపై పడింది. ఏపిలో పదవతరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30 తేదీ వరకు జరిగాయి. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ప్రశ్నాపత్రాల దిద్దుబాటు ప్రక్రియ పూర్తికాగా మార్కులను ఆన్లైన్లో ఎక్కించడం త్వరలో ప్రారంభం కాబోతుంది.

ప్రశ్నాపత్రాల డీకోడింగ్ తర్వాత మార్కులను ఆన్లైన్లోకి ఎక్కించి ఫలితాల విడుదలకు సన్నద్ధం కావాల్సి ఉంది. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డ్ తగిన ఏర్పాట్లు చేస్తోంది.

మొత్తానికి అన్ని ప్రక్రియలు సకాలంలో జగిరితే మే నెల మొదటి వారంలోనే 10వ తరగతి ఫలితాల విడుదలకు ఆస్కారం ఉంది. ఈ సంవత్సరం దాదాపు 6 లక్షల విధ్యార్ధులు తమ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

Sharing is caring!