🛕దేవాలయములో తప్పనిసరిగా చేయకూడని పనులు ❌

 1. మందిరములోనికి చెప్పులతోను, వాహనముపై వెళ్లుట;
 2. రథయాత్ర, జన్మాష్టమి మొదలైన వేడుకలు జరిగినపుడు వెళ్ళకుండుట;
 3. భగవంతుని వద్దకు వెళ్లి కూడా నమస్కరించకపోవుట;
 4. ఎంగిలి నోటితో శుద్ధుడు కాకుండా భగవానుని దర్శించుట;
 5. ఒకచేతితో నమస్కరించుట;
 6. అక్కడికక్కడే ఆత్మ ప్రదక్షిణ చేయుట;
 7. భగవానుని ఎదురుగా కాలుచాపి కూర్చొనుట;
 8. ఉన్నతాసనముపై కూర్చొండుట;
 9. భగవానుని ఎదురుగా నిద్రించుట;
 10. గట్టిగా మాట్లాడుట;
 11. అబద్దమాడుట;
 12. భగవానుని ముందే తినుట;
 13. ఒకరితో ఒకరు కబుర్లాడు కొనుట;
 14. ఏడ్చుట;
 15. పోట్లాడుట;
 16. ఎవరికైనా కష్టము కల్గించుట;
 17. వేరొకరిపై అనుగ్రహము చూపుట;
 18. స్త్రీలతో అనురాగముగా (Romantic talks) మాట్లాడుట;
 19. వస్త్రమును దులుపుట;
 20. ఇతరులను నిందించుట;
 21. ఇతరులను పొగుడుట;
 22. అశ్లీల శబ్దములను పలుకుట;
 23. అపానవాయువును విడిచిపెట్టుట;
 24. ఆయా ఋతువులలో పండే పండ్లను మొదటిసారిగా భగవంతునికి నివేదించకపోవడం;
 25. మన వాడుకకు తెచ్చుకుని మిగిలిపోయిన పళ్ళు, కాయలు, భగవానునికి సమర్పించుట;
 26. భగవానునకు వెనుకకు తిరిగి కూర్చొనుట (ఈ మధ్య వెనుకకు తిరిగి Selfie తీసుకుంటున్నారు);
 27. భగవంతుని ముందు వేరే వారిని సమస్కరించుట;
 28. భగవానుని నివేదన జరగకుండా ఏమైనా త్రాగుట,
 29. శక్తి ఉండి కూడ తక్కువ ఉపచారములతో అర్పించుట;
 30. గురువు విషయంలో మౌనంగా ఉండుట (స్తుతించకపోవుట),
 31. మన మనమే పొగుడుకొనుట;
 32. ఏ దేవుని గాని/ దేవతను గాని నిందించుట చేయరాదు.
 • సేకరణ పద్మ పురాణం నుంచి,

Sharing is caring!